ఎమ్మెల్యే పైళ్లను అడ్డుకున్న భూ బాధితులు
భువనగిరి ముచ్చట్లు:
యాదాద్రి జిల్లా భువనగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి పైళ్ళ శేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయింది. -ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోకి వెళుతున్న క్రమంలో స్థానికులు అయనన అడ్డుకున్నారు. తాజాగా.త్రిబుల్ ఆర్ భూ బాధితుల నుంచి అయనకు నిరసన సెగ తగిలింది. మూడు నెలల క్రితం రైతులకు బేడీలు వేయించి జైళ్లో శేఖర్ రెడ్డి పెట్టించాడాని నిరసనకారులు మండిపడ్డారు. తనను నిలదీస్తారని భయంతోనే , శేఖర్ రెడ్డి బాధితుల ఇంటికి తన కూతురు మాన్విత ను ప్రచారానికి పంసారు. ప్రచారానికి వచ్చిన శేఖర్ రెడ్డి కూతురును భూ బాధితులు అడ్డుకున్నారు. తమ కుటుంబ సభ్యులు అన్యాయంగా జైల్లోకి పంపి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లకు వచ్చారంటూ బాధిత మహిళలు. తిట్ల దండకం అందుకున్నారు. పైళ్ళ శేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. భూ బాధితులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మద్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాన్వితను బీఆర్ ఎస్ నేతలు అక్కడి నుంచి తీసుకువెళ్లారు.
Tags: Land victims who blocked MLA’s piles

