Date:22/02/2021
ఒడిశా ముచ్చట్లు:
ఆంధ్రా – ఒడిశా సరిహద్దు లోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలోని.. దోల్దలి అటవీ ప్రాంతంలో మందు పాతర పేలింది. ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయ పడ్డాడు. క్షతగాత్రున్ని 160వ బెటాలియన్‌కు చెందిన ధర్మేంద్ర సాహుగా గుర్తించిన అధికారులు చికిత్స కోసం అతడిని రాయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో.. ఛత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్, ఒడిశా బీఎస్ఎఫ్ బలంగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇదే సమయంలో మందు పాతర పేలి.. జవాను గాయపడ్డాడు.
వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: Landmine exploded in Awobi .. Jawan injured ..!