కొండచరియలు విరిగిపడి అనేక ఇండ్లు నేలమట్టం..
న్యూఢిల్లీ ముచ్చట్లు:
హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. తాజా ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. కులు జిల్లాలోని అన్నీ పట్టణంలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి.
Tags: Landslides collapsed and many houses were destroyed.

