సింహగిరి  ప్రదక్షిణలకు భారీ ఏర్పాట్లు 

Date:17/07/2018
సింహాచలం ముచ్చట్లు:
శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో ఈనెల 27వ తేది ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరిగే దేవాలయ ప్రదక్షిణకి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 26వ తేది చతుర్ధశి నాడు సింహగిరి ప్రదక్షిణతో పాటు పౌర్ణమి రోజున దేవాలయ ప్రదక్షిణ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయ ప్రదక్షిణకి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అధికారులు మార్పులు చేసారు. గత ఏడాది ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసిన భక్తులు ఈ ఏడాది నుండి గాలిపోపురం ముందు నుండి ప్రారంభించి ఆలయం ఆరుబయట నుండి ప్రదక్షిణ చేయాల్సి ఉంది.  అధికారులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణకి అనువుగా సన్నాహాలు చేస్తున్నారు. దేవాలయ ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేకంగా వంతెన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈశాన్యం మూలలో మెట్లు కడుతున్నారు. వంతెన దిగువ నుండి భక్తులు లోపలకి ప్రవేశించేలా, ప్రదక్షిణ చేసే భక్తులు వంతెన పై నుండి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రదక్షిణ చేసే భక్తులు, దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తులు దక్షిణ గోపురం వద్దనే కలిసి ముందుకు వెళ్లాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.  అధికారులు ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకోవాలసిన అవసరం ఉంది. వంద రూపాయల క్యూలో కూడా స్వల్ప మార్పులు చేస్తున్నారు.
సింహగిరి  ప్రదక్షిణలకు భారీ ఏర్పాట్లుhttps://www.telugumuchatlu.com/large-arrangements-for-cigarette-circuits/
Tags: Large arrangements for cigarette circuits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *