Natyam ad

టీటీడీలో పెద్ద ఎత్తున ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు

-. 15న టీటీడీ పరిపాలనా భవనం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ – ప్రతి ఉద్యోగి ఇంటిమీద జాతీయ జెండా ఎగురవేయాలి – ఈఓ

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు టీటీడీ లో కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు .టీటీడీ పరిపాలన భవనంలో శుక్రవారం ఈ అంశంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు . ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ , ఆగస్ట్ 15న టీటీడీ పరిపాలనా భవనం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ఉద్యోగులు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు . 75వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యోగులందరూ తమ ఇళ్ళ పై త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్నారు .పరిపాలనా భవనం వద్ద ప్రారంభమై మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ముగిసే ర్యాలీలో ఉద్యోగులందరూ పాల్గొనాలన్నారు . జాతీయ ఉత్సవాలను నిర్వహించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రతి ఉద్యోగికి పంపిణీ చేయాలని ఆయన జెఈవో శ్రీమతి సదా భార్గవిని ఆదేశించారు.

 

 

 

జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకుని , భారీ ర్యాలీ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్‌ను ఈవో ఆదేశించారు. ప్రతి ఉద్యోగి త్రివర్ణ పతాకం బ్యాడ్జి ధరించి తెల్లటి యూనిఫారంతో ర్యాలీలో పాల్గొనేలా చూడాలని అన్ని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రులు కూడా భాగస్వాములు కావాలని ఆయన ఆదేశించారు.టీటీడీ విద్యాసంస్థల నుంచి 1000 మంది విద్యార్థులను ర్యాలీకి ఎంపిక చేశామని జెఈవో ఈఓకు తెలిపారు. “కొంతమంది విద్యార్థులు జాతీయ నాయకుల వేషాలు ధరించి దేశభక్తి నినాదాలతో ర్యాలీని నడిపిస్తారు” అని ఆమె తెలిపారు.75 మంది స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనతో కూడిన ఆడియో విజువల్ ను (ఎ వి ) ఆగస్టు 15 సాయంత్రం తిరుపతిలో ఈవో నిర్వహించనున్న “ఎట్ హోమ్” సందర్భంగా ప్రదర్శించనున్నారు .ఎఫ్‌ఏసీఏవో  బాలాజి ,డీఎల్‌వో రెడ్డెప్ప రెడ్డి , , రవాణా
విభాగం జిఎం  శేషారెడ్డి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

 

Tags: Large scale Azadika Amrit Mahotsav celebrations in TTD

Post Midle

Leave A Reply

Your email address will not be published.