కడప  స్టీల్ ప్లాంట్ కు పెద్ద ఎత్తున నిధులు

Date:12/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్ కావడం గమనార్హం. అందుకే దీనిపై భారీ అంచనాలున్నాయి. వైఎస్ జగన్ తన సొంత జిల్లా వైఎస్సార్ కడపకు తాజా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. కడప స్టీల్ ప్లాంటు కోసం రూ.250 కోట్లు కేటాయించారు. దీంతో జగన్ మాట నిలుపుకున్నట్లు అయ్యింది. స్టీల్ ప్లాంటును మూడేళ్ల పూర్తి చేస్తామని చెప్పిన జగన్..

 

 

దీనికి అనుగుణంగానే ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయింపులు జరపడం గమనార్హం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కడప యాన్యుటీ ప్రాజెక్ట్‌కు రూ.120 కోట్ల కేటాయింపులు ప్రతిపాదించింది. అదేసమయంలో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి మరో రూ.100 కోట్లు కేటాయించారు ఆర్థిక మంత్రి బుగ్గన. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.18,327 కోట్లు కేటాయించింది. ఇందులో ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు.. ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002 కోట్లు.. వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8,550 కోట్లు.. రైతులకు ఉచిత విద్యుత్‌కు రూ.4,525 కోట్లు కేటాయిస్తారు.

బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి

Tags: Large-scale funding for Kadapa Steel Plant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *