చేపల లోడు లారీబోల్తా
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
బూర్గంపాడు మండలం క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున ఏపీ నుండి నాగపూర్ కు చేపల లోడుతో వెళుతున్న అదుపుతప్పి లారీ బోల్తా పడింది. దాంతో చేపలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికులు చేపలు ఏరుకోవడంలో పోటీపడ్డారు. దాంతో కొంత సేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికిచేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేసారు. ఘటనలో లారీ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. వందలాది మంది జనం చేపల కోసం ఎగబడడంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసారు. ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. స్థానికులు బైక్స్, ఆటోలలో చేపలు తరలించుకుపోయారు. చేపల కోసంతోపులాటకు దిగారు. లారీలోడు కాళీ చేయడానికి అరగంట సమయం పట్టింది. లారీనుంచి చేపల లోడు ఖాళీ అయిపోయిన తరువాత ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయింది.
Tags: Larrybolta loaded with fish

