Natyam ad

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఆఖరి అవకాశం

-22వ తేదీ వరకు ఉన్న అవకాశాన్ని మరో రోజు పొడిగిస్తూ నిర్ణయం

-అవకాశాన్ని వినియోగించు కోండి… :

-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి

 

Post Midle

చిత్తూరు ముచ్చట్లు:

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఆఖరు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. షన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.సార్వత్రిక ఎన్నికలు – 2024 కి సంబంధించి ఎన్నికల విధులకు కేటాయించ బడ్డ అధికారులు, సిబ్బందికి జిల్లాలో ఓటు హక్కు ఉన్నట్లయితే వారి ఓటు హక్కును వినియోగించు కునేందుకు పూరించిన ఫారం -12 (పోస్టల్ బ్యాలెట్) ను ఈ నెల 23వ తేదీ లోపు హెచ్ఓడి లు జిల్లా కలెక్టర్ కు అందజేయాలన్నారు. జిల్లాలో ఓటు హక్కు కలిగి ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వివరాలను సంబంధింత హెచ్ఓడి లు అందజేసేందుకు ఈనెల 22 వరకు ఉన్న అవకాశాన్ని మరో రోజు పొడిగించి 23 వ తేదీ వరకు చేయడం జరిగిందన్నారు. అత్యవసర సేవలు అందించే విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది ఫారం 12- (డి) ని పూరించి అందజేయాలన్నారు.

ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది చిత్తూరు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లైతే అటువంటి వారు ఫారం -12 మరియు అనెగ్జర్ 12 (E) ను హెచ్ ఓ డి ల ద్వారా జిల్లా కలెక్టర్ వారికి సమర్పించాలన్నారు. ఏ అధికారి, సిబ్బంది నిర్ణీత సమయంలోపు జిల్లా కలెక్టర్ ద్వారా ఫారం -12,అనెగ్జర్ (ఇ)
ని పూరించి సమర్పించని యెడల వారు వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించు కోవలసి ఉంటుందని, అటువంటి వారికి చిత్తూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం ఉండదనన్నారు.కావున అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఈ నెల 23 లోపు సంబంధిత హెచ్ఓడి ల ద్వారా ఫారం -12,అనెగ్జర్ (ఇ) పూరించి అందజేయాలని ఆ ప్రకటన లో తెలిపారు.

 

Tags: Last chance to avail postal ballot facility

Post Midle