లతా మంగేష్కర్ కోవిడ్ పాజిటివ్.. ఐసీయూలో చికిత్స!

ముంబాయి ముచ్చట్లు:
 
ప్రముఖ  సినీ గాయకురాలు, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ ఐసీయూలో ఉన్నరని సమాచారం. ఈ వార్త  అభిమానులకు ఆందోళ కలిగిస్తోంది. ఆమెకు కోవిడ్ పాజిటివ్ గా తేలిందని, మైల్డ్ సింప్టమ్స్ ఉన్న ఆమెను ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చినట్టు లతా మేనకోడలు రచనా తెలిపారు.  వయసు రీత్యా  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమెను ఐసీయూ లో చేర్చామని, దయచేసి మా ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధించండి అంటూ రచనా మీడియాను కోరారు. 2019లో లతా వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. మళ్ళీ ఇప్పుడు కరోనా కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Lata Mangeshkar Kovid Positive .. Treatment In ICU!

Natyam ad