Natyam ad

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అర్థరాత్రి ఉద్రిక్తత..

విజయవాడ ముచ్చట్లు:

రాష్ట్రం లో విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగ శ్రావణ్ చేపట్టిన విద్యార్థి సంఘర్షణ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య పెద్ద ఎత్తున సంఘర్షణ తలెత్తింది.ఎట్టకేలకు పోలీసులు శ్రావణ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా టిడిపి మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు.ఆడవారు అని చూడకుండా అడ్డుకున్న వారిని పోలీసులు విచక్షణారహితంగా పక్కకు లాగేసారు. తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి పొట్లూరి దక్షిత్ మాట్లాడుతూ… ” ప్రజాస్వామ్య పంధాలో శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే , ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకుండా దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వం చేతకానితనం అని ధ్వజమెత్తారు.

 

Post Midle

Tags:Late night tension in district Telugu Desam Party office..

Post Midle