మరో వివాదానికి తెర లేపుతున్న బాబు

Laughing to open another controversy

Laughing to open another controversy

Date:20/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారికి ‘హైద్రాబాద్‌ – ఉమ్మడి రాజధాని’ అనే విషయం మళ్ళీ గుర్తుకొచ్చింది. హైద్రాబాద్‌ కేంద్రంగా మరోమారు, ‘పచ్చ’ రాజకీయాలు నడిపేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతోపాటు, త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, హైద్రాబాద్‌ కేంద్రంగానే ‘వ్యవహారాలు’ చక్కబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే చంద్రబాబు, ‘ఉమ్మడి రాజధాని’ అంశాన్ని అటకెక్కించేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని రెండుగా విభజించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టంలోనే హైద్రాబాద్‌ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు.
అయితే, ‘మన పరిపాలన.. మన ఆత్మగౌరవం.. మన రాష్ట్రం..’ అంటూ చంద్రబాబు, ఓటుకు నోటు కేసు తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కి పారిపోయారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఓటుకు నోటు కేసుకు విరుగుడుగా ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని తెరపైకి తెచ్చి.. ఏపీ కేంద్రంగా చంద్రబాబు రాజకీయాలు నడుపుతూ వచ్చారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో, అనూహ్యంగా ‘బాబ్లీ ప్రాజెక్ట్‌ – టీడీపీ రగడ’ తెరపైకి రావడం, ఆ కేసుని పట్టుకుని చంద్రబాబు హైద్రాబాద్‌ కేంద్రంగా మళ్ళీ రాజకీయంగా బలోపేతమవ్వాలనే ఆలోచన చేయడం..
ఇవన్నీ అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇంటెలిజెన్స్‌ సహా అన్ని వ్యవస్థల్నీ అమరావతితోపాటు, హైద్రాబాద్‌లోనూ మోహరించాలని చంద్రబాబు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీచేయడం వివాదాస్పదమవుతోంది.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలంగాణలో ఏం పని.? అని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రశ్నిస్తోంటే, ‘హైద్రాబాద్‌ పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని.. 2014 వరకు మాకు హైద్రాబాద్‌లో హక్కులున్నాయి..’
అని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. హైద్రాబాద్‌ పేరుతో ఇంకోసారి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నా.. అది ఆంధ్రప్రదేశ్‌లో ‘నెగెటివ్‌ ఇంపాక్ట్‌’ చూపించబోతోంది. బాబ్లీ రగడ బ్యాక్‌ఫైర్‌ అవడం దాదాపు ఖాయమైపోయిన నేపథ్యంలో, చంద్రబాబు హైద్రాబాద్‌ పేరుతో చేసే రచ్చ.. తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త కొత్త వివాదాలకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు.
Tags: Laughing to open another controversy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *