రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల షురూ
తిరుపతి ఈఎంసీలో మూడు గ్లోబల్ కంపెనీల యూనిట్లను ప్రారంభించిన సీఎం
టీసీఎల్, ఫాక్స్‌లింక్, డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్లను ప్రారంభించిన సీఎం
వీటిలో టీవీ–మొబైల్ ప్యానెళ్లు, కెమెరా మాడ్యూల్స్, ప్రింటర్ల సర్క్యూట్‌బోర్డులు, ఐఫోన్ల ఛార్జర్ల తయారీ
మరో రెండు యూనిట్లకు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి
తిరుపతి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి సమీపంలోని ఇంగలూరులో అడిడాస్ షూ తయారీ కంపెనీ అపాచీకి సీఎం శంకుస్థాపనరెండు దశల్లో రూ.800 కోట్ల పెట్టుబడిఎంఓయూలు కుదుర్చుకున్న ఏపీఈఐటీఏతిరుపతి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీ కీలక కేంద్రం అవుతోంది. పలు గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీలో) గురువారం ఒక్కరోజే ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ప్రతిష్టాత్మక కంపెనీలకు చెందిన 3 యూనిట్లను ప్రారంభించారు. అంతేకాక అడిడాస్ షూస్ తయారుచేస్తున్న అపాచీ కంపెనీ యూనిట్ సహా మరో రెండు ఎలక్ట్రానిక్స్ యూనిట్లకు కూడా సీఎం భూమి పూజ చేశారు. ఇవాళ ప్రారంభించిన, భూమి పూజ చేసుకున్న పరిశ్రమల పెట్టుబడుల విలువ దాదాపు రూ.4వేల కోట్లుకాగా, సుమారు 20వేల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

Tags:Launch of electronics companies in the state
