ఎమ్మిగనూరులో కనకదుర్గ గోల్డ్ లోన్స్ ప్రారంభం
ఎమ్మిగనూరు ముచ్చట్లు:
ఫైనాన్స్ రంగంలో గత నలభై సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ వారి కనకదుర్గ గోల్డ్ లోన్ తమ సంస్థ కర్నూల్ నంద్యాల జిల్లాలో నాల్గవ శాఖను ఆదోని బైపాస్ రోడ్డు అప్పన్న గౌడ కాంప్లెక్స్ మొదటి అంతస్తు ఎమ్మిగనూరులో ఉదయం ప్రారంభించారు. ఆర్బిఐ గుర్తింపు పొందిన ఈ సంస్థ 5వేల నుంచి 50 లక్షల వరకు అతి తక్కువ వడ్డీకి లోన్ సౌకర్యం కలిగిస్తుంది. ప్రతి గ్రాముకు అత్యధికంగా ఫైనాన్స్ అందిస్తుంది. ప్రజల వ్యాపార వ్యక్తిగత అవసరాలకు తమ సంస్థ ఎంతగానో దోహద పడుతుందని కనకదుర్గ ఫైనాన్స్ ఏరియా మేనేజర్ జె.చంద్రశేఖర్ రెడ్డి, తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ కాశీ విశ్వనాథన్, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags: Launch of Kanakadurga Gold Loans in Emmiganoor
