Natyam ad

టీటీడీ ఆలయాల స‌మాచారంతో ఆధునీకరించిన వెబ్‌సైట్ ప్రారంభం

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల్లో గ‌ల టీటీడీ స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు విస్తృత ప్రాచుర్యం క‌ల్పించేదిశ‌గా అన్ని వివ‌రాల‌తో ఆధునీకరించిన వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్  భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.  టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు సంబంధించిన స్థ‌ల‌పురాణం, ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న వేళ‌లు, రవాణా వివరాలు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ ను ఆధునీకరించింది.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవోలు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, సివిఎస్ఓ  నరసింహ కిషోర్, డిఎల్వో  వీర్రాజు, సిఈ  నాగేశ్వరరావు, ఐటి జనరల్ మేనేజర్  ఎల్ఎం.సందీప్ పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Launch of modernized website with information of TTD temples

Post Midle