మంత్రి కాకానిచే  సింహపురి రైతు సిల్వర్ జూబ్లీ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

నెల్లూరు ముచ్చట్లు:

సింహపురి రైతు అభ్యుదయ రైతు మాసపత్రిక స్వర్ణోత్సవ వేడుకలు స్థానిక పురమందిరం లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడుతుందని సంపాదకులు వి .నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహపురి రైతు అభ్యుదయ రైతు మాస పత్రిక ప్రారంభించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని సిల్వర్ జూబ్లీ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వైస్ చైర్మన్ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ ఛాన్స్లర్ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతు సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లో సింహపురి రైతు మాస పత్రిక ఉప సంపాదకుడిగా సి ఎస్ ఆర్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Launch of Sinhapuri Farmer Silver Jubilee Special Issue by Minister Kakani

Leave A Reply

Your email address will not be published.