Launch of the journey between Sagar and Srisailam begins

సాగ‌ర్‌, శ్రీశైలం మ‌ధ్య లాంచీ ప్ర‌యాణం ప్రారంభం

Date:21/11/2020

హైద‌రాబాద్‌ ముచ్చట్లు:

సాగ‌ర్‌, శ్రీశైలం మ‌ధ్య లాంచీ ప్ర‌యాణం సౌక‌ర్యం మ‌ళ్లీ ప్రారంభమ‌య్యింది. లాంచీ ప్ర‌యాణాన్ని నందికొండ మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ అనూషారెడ్డి ఇవాళ ప్రారంభించారు. దీంతో ‌సాగ‌ర్‌లోని హిల్‌కాల‌నీ నుంచి 16 మంది ప‌ర్యాట‌కుల‌తో శ్రీశైలానికి లాంచీ బ‌య‌లుదేరింది. ఆరుగంట‌ల‌పాటు కృష్ణా న‌దిలో ప్ర‌యాణించి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు శ్రీశైలం చేరుతుంది. శ్రీశైలంలోని ద‌ర్శ‌నీయ స్థ‌లాలు, దైవ‌ద‌ర్శ‌నం చేయించి బ‌స‌క‌ల్పించేలా ప‌ర్యాట‌క‌శాఖ ఏర్పాట్లు చేసింది. రేపు ఉద‌యం శ్రీశైలం నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు సాగ‌ర్ చేరుతుంది. అక్క‌డి నుంచి ప‌ర్యాట‌కుల‌ను బ‌స్సులో హైద‌రాబాద్‌కు తీసుకువ‌స్తారు. దీనితో ఇక‌ నాగార్జునసాగ‌ర్, శ్రీశైలం మ‌ధ్య ఉన్న ప్ర‌కృతి అందాల‌ను వీక్షించ‌వ‌చ్చు.

 

 ‌గాంధీలో పునఃప్రారంభ‌మ‌యిన సాధార‌ణ వైద్య సేవ‌లు

Tags:Launch of the journey between Sagar and Srisailam begins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *