చట్టాల సంస్కరణలు సామాన్యులకు విద్య అందించే విధంగా ఉండాలి

Laws of reform should provide education to the common manLaws of reform should provide education to the common man

Laws of reform should provide education to the common man

-యూనివర్శిటీలకు నేరుగా నిధులిచ్చే మార్గదర్శకాలుండాలి
– అధ్యాపకులకు ఇన్ సర్వీస్ శిక్షణ తప్పనిసరిగా ఉండాలి
-హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా-2018 బిల్లుపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
Date:16/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజీసీ) స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇండియా-2018 పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు కూడా ఉన్నత విద్య అందేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. యూజీసి స్థానంలో కేంద్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల అభిప్రాయాలను కోరంది. దీనిపై నేడు బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్ని యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, విద్యావేత్తలు, నిపుణులతో నిర్వహించిన మేధోమథన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చే సంస్కరణలు మన దేశ విశ్వవిద్యాలయాలను గ్లోబల్ విశ్వవిద్యాలయాల స్థానంలో నిలబెట్టే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు అధ్యాపకులకు ఇన్ సర్వీస్ శిక్షణ కచ్చితంగా ఇవ్వాలన్నారు. అయితే కేంద్రం ప్రస్తుతం తీసుకొస్తున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా2018లో ఇలాంటి అంశాలు కాకుండా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. విశ్వవిద్యాలయాల అధికారులను నేరుగా నియమిస్తూ అధికార కేంద్రీకరణ చేయడం మంచిది కాదన్నారు. అదేవిధంగా రాష్ట్రాలకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులు కూడా కేంద్రం హస్తగతం చేసుకునేలా ఈ బిల్లు ఉందన్నారు. ఇటీవల కొన్ని విశ్వవిద్యాలయాల్లో కేంద్రమే నేరుగా వీసీలను నియమించడం కూడా తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదముందన్నారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో ఎక్కువగా బ్యూరోక్రాట్లు ఉండి, తక్కువ సంఖ్యలో విద్యావేత్తలు, నిపుణులు ఉన్నారని, ఈవిధానం కూడా మంచి విద్యా వ్యవస్థకు అనుకూలమైంది కాదన్నారు.విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీల నమోదులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉందని, అందులో భాగంగానే సమాజంలో వెనుకబడిన వారికి విద్యలో ఉన్నత ప్రమాణాలు కలిగిన అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు.ఎన్డీఏ పాలనలో కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా విద్యరంగానికి నిధులు తగ్గిస్తూ వస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అదేవిధంగా కేంద్ర విద్యా సంస్థల్లో సగానికి పైగా ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయడం లేదన్నారు. ఇప్పటికే దేశంలో నూతన విద్యావిధానంపై ఒక కమిషన్ వేసి నివేదిక రాకుండానే మళ్లీ ఈ కొత్త కమిషన్ కోసం ప్రతిపాదనలు అడగడం వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. కొత్త సంస్కరణలు తీసుకొచ్చే ముందు ప్రజలు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలు తీసుకొనే సమయం ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా కేంద్రీకృత పాలన వల్ల, మితిమీరిన నియంత్రణ సంస్థల వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయన్నారు.రాష్ట్రాలలోని ఆయా ప్రాంతాల అవసరాల మేరకు విశ్వవిద్యాలయాలు, కాలేజీలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించిందని, ఈ కొత్త బిల్లు ఈ వెసులుబాటును తొలగించే విధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.మొత్తానికి పేదలు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చే విధంగా ఈ బిల్లు లేదని, వీరందరికి మరింత చేరువగా ఉన్నత విద్యను తీసుకొచ్చే విధంగా సవరణలుండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులోని ప్రతి క్లాజుపై ఈ సమావేశంలోని వీసీలు, విద్యావేత్తలు, నిపుణులు చర్చించి ప్రతిపాదనలు రూపొందిస్తారని తెలిపారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 20వ తేదీలోపు పంపిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రతిపాదనలపై ఇక్కడి ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఈ బిల్లులోని సవరణలపై తమ గళాన్ని వినిపిస్తారని చెప్పారు.ఈ సమావేశంలో ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి , అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ కె. సీతారావు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వెంకటరమణ, లింబాద్రి, ఇతర వీసీలు, అధికారులు పాల్గొన్నారు.
చట్టాల సంస్కరణలు సామాన్యులకు విద్య అందించే విధంగా ఉండాలిhttps://www.telugumuchatlu.com/laws-of-reform-should-provide-education-to-the-common-man/
Tags; Laws of reform should provide education to the common man

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *