Natyam ad

చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి- న్యాయమూర్తి వాసుదేవరావు

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలు కలసి మెలసి జీవించేందుకు ఏర్పాటు చేసిన చట్టాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పుంగనూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి వాసుదేవరావు తెలిపారు. బుధవారం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కార్తీక్‌, ప్రిన్సిపల్‌ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సిందు తో కలసి కోర్టు ఆవరణంలో ఆయన లీగల్‌ సర్వీసస్‌ డేను నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ సమాజంలో ఎదురైయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు చట్టాలను వినియోగించుకోవాలన్నారు. నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. పేద ప్రజల కోసం లీగల్‌ సర్వీసస్‌ అథారిటి ద్వారా న్యాయవాదులను నియమించి, కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం పేద కక్షిదారులు వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. లక్షరూపాయల లోపు ఆదాయం కలిగిన వారికి ఫీజుల మినహాయింపు లభిస్తుందన్నారు. అలాగే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరువర్గాలు, వారి తరపున న్యాయవాదులు కృషి చేసి, లోక్‌అదాలత్‌లో కేసులను పరిష్కరించేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Laws should be taken advantage of- Justice Vasudeva Rao

Post Midle