కోర్టు కు చంద్రబాబు తరపున లాయర్

AP Chief Minister Chandrababu Naidu said that the BJP, which has been unfair to Andhra Pradesh, will not forgive people of future generations.

AP Chief Minister Chandrababu Naidu said that the BJP, which has been unfair to Andhra Pradesh, will not forgive people of future generations.

Date:19/09/2018
అమరావతి  ముచ్చట్లు
బాబ్లీ పోరాట ఘటనకు సంబంధించి కోర్టు నోటీసులు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన తరపున న్యాయవాదిని ధర్మాబాద్ న్యాయస్థానానికి పంపాలని నిర్ణయించారు. ఈ నెల 22న ఐక్యరాజ్యసమితిలో పాల్గొనే అరుదైన అవకాశం ఉన్నందు తన బదులు న్యాయవాదులను కోర్టుకు పంపాలని నిర్ణయించారు.
ఈ మేరకు సీఎం తరపున న్యాయవాదులు వెళ్లి నాన్ బెయిల్‌పై రీకాల్ పిటిషన్ చేయనున్నారు.ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో సహా కొందరు తెదేపా నేతలు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు పరిశీలన నిమిత్తం వెళ్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని కేసులు నమోదు చేశారు.
దీనికి సంబంధించి న్యాయస్థానంలో హాజరుకావాలంటూ చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్‌బాబు సహా 16 మందికి ధర్మాబాద్‌ కోర్టు ఇటీవల నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించి చంద్రబాబు పార్టీ నేతలు, న్యాయవాదులో తర్జనభర్జనలు సాగించారు.
Tags:Lawyer on behalf of Chandrababu to court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *