ఎనర్జీతో వకీల్ సాబ్

హైదరాబాద్  ముచ్చట్లు:

వకీల్ సాబ్’ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. వాటిలో ఒకటి మరో భాషలో హిట్టయిన సినిమాకి రీమేక్ అయితే, పవన్ ఇంతవరకూ టచ్ చేయని పీరియాడిక్ జానర్ మరొకటి. ఈ రెండు సినిమాల విషయం అటుంచితే హరీష్ శంకర్ డైరెక్షన్‌‌‌‌లో పవన్ నటించబోయే సినిమాకి మాత్రం సెపరేట్ క్రేజ్ ఉంది. ఎందుకంటే పవన్ నుండి ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ హరీష్‌‌‌‌కి తెలుసు కనుక అవన్నీ ఆ సినిమాలో ఉంటాయని అభిమానుల నమ్మకం. పైగా ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఇప్పటికే ఓసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాంబినేషన్ కావడంతో అనౌన్స్‌‌‌‌మెంట్ రోజు నుండే అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. వాటిని  ఏమాత్రం తగ్గనీయకుండా తన సోషల్ మీడియా పోస్టులతో మరింత హైప్ ఇస్తున్నాడు హరీష్. రీసెంట్‌‌‌‌గా అతను షేర్ చేసిన ఓ వీడియో ద్వారా పవన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనేది ఊహించుకుంటున్నారంతా. ‘బద్రి’ సినిమాలో పవన్ ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీలోని పవన్ సీన్స్‌‌‌‌ని చూపిస్తూ, ఆ ఎనర్జీని మళ్లీ చూద్దాం అంటూ ట్వీట్ చేశాడు హరీష్‌‌‌‌. దాంతో ఫ్యాన్స్‌‌‌‌లో జోష్‌‌‌‌ వచ్చేసింది. అలాంటి సినిమా కోసం ఎగ్జయిటింగ్‌‌‌‌గా ఎదురుచూస్తున్నామంటూ వారితో పాటు హీరో సాయితేజ్ కూడా కామెంట్ పెట్టాడు. ఆల్రెడీ పవన్ లుక్, క్యారెక్టర్ డిజైన్ లాంటివి ఇటీవల ఫైనల్ చేశారనే టాక్ కూడా రావడంతో  పవన్‌‌‌‌తో హరీష్ ఎలాంటి సినిమా తీస్తున్నాడో చూడాలనే ఆసక్తి ఫ్యాన్స్‌‌‌‌లో అంతకంతకూ ఎక్కువవుతోంది.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Lawyer Saab with Energy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *