Natyam ad

ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఇస్మాయిల్, కానిస్టేబుల్ షేక్షవలి ఏఎస్ఐ నాయక్ లను డిస్మిస్ చేయాలని న్యాయవాదులు ధర్నా

హిందూపురం ముచ్చట్లు:

లీగల్ న్యూస్ హిందూపురం దేవాంగం గిరిష్ అనే యువకుని హిందూపురం 1వ పట్టణ పోటీసు వారు ముక్కిడిపేటలోని యువకుడి ఇంటి నుండి అక్టోబరు 18తేదీన ఉదయం 10:30 తీసుకెళ్లారు అప్పటి నుండి యువకుడి తల్లిదండ్రిలకు గాని బంధువులకు గాని, స్నేహితులకు గాని ఆచూకీ తెలియలేదని యువకుడి తల్లిదండ్రులు మరియు యువకుడి బంధువులు 1వ పట్టణ పోలీసు వారిని వెళ్లి అడిగిన మేము గిరిష్ అనే యువకుని విచారణ పేరిట ఇంత వరకు 1వ పట్టణ పోలీసు స్టేషన్ తీసుకొని రాలేదని పోలీసులు తెలిపారు. దీనితో యువకుడి తల్లి అయిన నాగరత్నమ్మ న్యాయవాది ద్వారా జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ పాస్ట్ క్లాస్ హిందూపురం కోర్టు నందు సర్చ్ పిటీటీషన్ వేసి మేజిస్ట్రేట్ వారి నుండి సర్చ్ వారంట్ తీసుకొని 1వ పట్టణ పోలీసు స్టేషన్ వారికి సర్చ్ వారంటూ గురించి తెలియజేసి వారంటూ భాగంగా పిటిషినర్ (గిరీష్ తల్లి గారైన) నాగరత్నమ్మ, బెంచ్ క్లార్క్, శివశంకర్, పిటిషినర్ తరుపున న్యాయవాది మహమ్మద్ రాఖీబ్ అడ్వకేట్ కమిషనర్ ఉదయ్ సింహ రెడ్డి 1వ పట్టణ పోలీసు స్టేషన్ తనిఖీ చేసి 1వ పట్టణ పోలీసు ఉన్న గిరిష్ తీసుకెళుతుంటే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ షేక్షవలి మరియు 1వ పట్టణ సర్కెల్ ఇంస్పెక్టర్ అబ్దుల్ ఇస్మాయిల్ అడ్వకేట్ కమిషనర్ ప్రక్కకు నెట్టడమే కాకుండా కోర్టు ఇచ్చిన సర్చ్ వారంటును మడిచి పెట్టుకో లేకపోతే కోర్టు వారంటు మడిచి చెత్తబుట్టలో వెయ్యి న్యాయవాదుల పేర్లతో నానా దుర్బర్షాలు ఆడడం జరిగింది.

 

 

 

Post Midle

తాను చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి సర్చ్ వారంటూ ప్రకారం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీకి వెళ్లిన పిటిషనర్ అయిన నాగరత్నమ్మ , పిటిషనర్ న్యాయవాది అయిన మహమ్మద్ రాఖీబ్ కోర్టు బెంచ్ క్లార్క్ శివశంకర్ తప్పుడు కేసు నమోదుకు కారుకులన పిర్యాదుదారుడైన శేక్షవలి పీసి, ఏ.ఎస్.ఐ నాయక్ మీద మరియు 1వ పట్టణ సర్కెల్ ఇంస్పెక్టర్ అయిన అబ్దుల్ ఇస్మాయిల్ మీద డిస్మిస్ చేయాలని హిందూపురం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు గేటువద్ద న్యాయవాదులు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.నాగప్ప, సీనియర్ న్యాయవాది సి.రామచంద్రారెడ్డి, డి.శివశంకర్, ఆంజనేయులు, డి.వెంకటేష్, యు.ఈశ్వరప్ప, జి.కృష్ణమూర్తి, పిటిషినర్ అడ్వకేట్ మహమ్మద్ రాఖీబ్, ఉదయ్ కుమార్ రెడ్డి, బి.వెంకటేష్, వనురవప్ప, సుదర్శన్, వీరసేన , మురళి మొదలైన న్యాయవాదులు ధర్నాలో పాల్గొన్నారు.

 

Tags: Lawyers dharna to dismiss Inspector Abdul Ismail, Constable Shekshawali ASI Naik

Post Midle