మంత్రి పెద్దిరెడ్డిని కలసిన పుంగనూరు న్యాయవాదులు
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బార్‌అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గల్లాశివశంకర్‌నాయుడు , కార్యదర్శి ఆనంద్‌కుమార్ లు శనివారం తిరుపతిలో కలిశారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి మంత్రిని న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గ సభ్యులను మంత్రి సన్మానించి అభినందించారు. మంత్రికి పలు సమస్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మల్లికార్జునరెడ్డి, ఆకుల చెన్నకేశవులు, సుధాకర్‌రెడ్డి, అంజిబాబు, సమివుల్లా, వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags; Lawyers from Punganur met Minister Peddireddy
