పుంగనూరులో27న న్యాయవాదుల ర్యాలీ

పుంగనూరుముచ్చట్లు:

ప్రభుత్వం ఏకపక్షంగా మార్పులు చేసిన రెవెన్యూ చట్టం 27 ను రద్దు చే యాలని కోరుతూ ఈనెల 27న న్యాయవాదులు, కక్షిదారులు , అఖిలపక్ష నాయకులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఆనందకుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన చట్టంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని 24 నుంచి డిసెంబర్‌ 1 వరకు న్యాయవాదులు విధులు బహిష్కరణ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ర్యాలీలు నిర్వహించి, తమ డిమాండులను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Tags: Lawyers rally on 27th in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *