Natyam ad

లాయర్స్ వాయిస్ కేలండర్ అవిష్కరణ

తిరుపతి ముచ్చట్లు:
 
లాయర్స్ వాయిస్ మాసపత్రిక 2022 సం.ర కేలండర్ను శనివారం ఉదయం తిరుపతి కోర్ట్ హాల్ నందు తిరుపతి అడ్వకేట్ అసోషియేషన్ అధ్యక్షులు తమిదలపాటి దినకర్ అవిష్కరించారు. ఈ సందర్బంగా తమిదలపాటి దినకర్ మాట్లాడుతూ గత ఆరు సం.రాల నుండి రాజారెడ్డి లాయర్స్ వాయిస్ పత్రికను నడుపుచున్నారని అన్నారు. ఈ కేలండర్ లో లాయర్లకి ఉపయోగపడే విదంగా ఉందని, సెలవలుతో కూడిన కేలండర్ చాల ఉపయుక్తకరంగా ఉంటుందని అన్నారు. లాయర్స్ వాయిస్ ఎడిటర్ ఎన్. రాజారెడ్డి మాట్లాడుతూ లాయర్స్ వాయిస్ పత్రిక ద్వారా సుప్రీం కోర్టు, హైకోర్ట్ లు ఇచ్చే తీర్పులు వివిద వ్యాసాలు ముద్రించడం వలన నేటి యువ లాయర్లకు ఉపయోగ పడే విధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్య క్రమంలో అపుస్మ రాష్ట్ర కార్యదర్శి ఎన్. విశ్వనాదరెడ్డి లాయర్లు నెల్లూరు యోగానంద్, మార్టిన్, సుధాకర్, రమేశ్, వెంకటరత్నం తది తరులు ఉన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Lawyers voice calendar unveiled