ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం పెట్టిన లక్షేటిపేట్ పోలీసులు

Date::03/04/2020

లక్షటి పెట్ ముచ్చట్లు:

ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ సందర్భంగా యాచకులకు అనాదలకు, వృద్ధులకు, మతిస్థిమితంలేని వారికి శుక్రవారం భోజనం పెట్టించి మానవత్వం చాటారు లక్షటిపెట్ పోలీసులు.   ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి నివారణ గురించి ప్రస్తుతం దేశం మొత్తంలో లాక్ డౌన్ నడుస్తున్న సందర్భంగా   పట్టణంలో రోడ్లపై పలు వీధుల్లో ఉంటున్న  యాచకులకు,  వృద్ధులకు అనాధలకు, పేదవారికి, మతిస్థిమితం లేని వారికి, తినడానికి తిండిలేక  ఆకలితో తల్లడిల్లుతున్న వారిని చూసి చలించిపోయిన సీఐ నారాయణ నాయక్, ఎస్సై దత్తాత్రి  ఆధ్వర్యంలో లక్షేట్టిపేట్ పట్టణంలో సుమారు 10మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయించి వారికి వడ్డించి ఆకలి దప్పిక తీర్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ  కరోన వైరస్ నియంత్రించడం కోసం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా యచకులకు, ఏ ఆదారంలేని అనాదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇది చూసిన మేము చలించి భోజన సదుపాయం కల్పించామని, మరికొందరికి త్రాగడానికి మంచినీరు సహితం దొరకడం లేదని ఇలాంటివి కనిపిస్తే చాలా బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి  అనాదలు ఎక్కడైనా కనిపిస్తే మానవత్వంతో ముందుకు వచ్చి సహకరించాలని ఆయన దాతలను కోరారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గోన్నారు

కరోనా కట్టడికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కోచ్ లు

Tags:Laxetipate police who serve lunch to the hungry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *