ఎరుకల ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన

హైదరాబాద్ ముచ్చట్లు:


నిజాంపేటలో తెలంగాణ ఎరుకల ఆత్మగౌరవ భవనానికి  మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ లు బుధవారం శంకుస్థాపన చేసారు. ఈ కార్య్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణా రావు, ఎమ్మెల్సీ శంబీపుర్ రాజు, ఎరుకల సమాజం అధ్యక్షులు రాములు తదితరులు పాల్గోన్నారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అందరం కలిసి ఉంటే, సీఎం కేసీయార్ వద్దకు తీసుకు వెళ్లి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా.  స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో అన్ని సమస్యలు పోయు 2 కోట్లతో కొత్త భవనం నిర్మించుకోవడం సంతోషం. కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఈ భవనం నిదర్శనం.

 

రేపు సాయంత్రం మరో కోటి రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం.  మొత్తం 3.5 కోట్లతో మంచి భవనం, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.  కేంద్రంలోని బిజెపి మాటలు తప్ప పని చేయదు. గిరిజనుల కోసం ఆలోచించలేదు. దేశంలో 10.50 కోట్ల మంది గిరిజన జనాభా ఉంటే కేంద్రం బడ్జెట్ లో పెట్టింది కేవలం 0.02%  మనం రాష్ట్రంలో రూ. 13413 కోట్లు బడ్జెట్ లో పెట్టుకున్నాం. అంటే ఇది 9.5%.  అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల పేరిట ఎన్నో చేసుకుంటున్నాం.  వృత్తిని నమ్ముకుని ఉన్నవారికోసం ప్రభుత్వం సహకారం అందితున్నది. ఇంకా చేస్తుంది.
నిజాంపేట్ మున్సిపాలిటీ లో గతంలో 2 బస్తీ దవాఖాన ఉండే, వాటికి అదనంగా మరో 8 శాంక్షన్ చేస్తున్నాం. వారంలో ఆర్డర్ ఇస్తాం. రెండు మూడు నెలలలో అందుబాటులోకి వస్తాయి. కొంపల్లి లో కూడా 2 బస్తీ దవాఖానలు పెంచుతామని అన్నారు.

 

Tags: Laying the foundation stone for Erukal’s self-esteem building

Leave A Reply

Your email address will not be published.