రామసముద్రం నుంచి బీఎస్పీ సభకు తరలిన నాయకులు
రామసముద్రం ముచ్చట్లు:
తిరుపతి ఇందిరా మైదానంలో ఆదివారం జరిగిన రాయలసీమ బహుజన రాజ్యాధికార సభకు రామసముద్రం నుంచి బిఎస్పీ నాయకులు , కార్యకర్తలు తరలివెళ్లారు. బహుజన సమాజ్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పార్థసారధి, మండల అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 150 మంది కార్యకర్తలు తిరుపతి సభకు తరలివెళ్లారు. కార్యకర్తలు గంగప్ప, రామచంద్ర, వెంకటేష్, అప్పిరాజు, మల్లికార్జునగౌడ్, పరమేష్, శ్రీనివాసులు,నారాయణ, సుధాకర్, చంద్ర, ప్రకాష్, చిన్నస్వామి, నరసింహులు, నారాయణ, హనుమప్ప తదితరులు వెళ్లారు.

Tags: Leaders moved from Ramasamudra to BSP Sabha
