Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన దేశం నేతలు

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి , మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో సీనియర్‌ తెలుగుదేశం నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం మంత్రి పర్యటనలో నూతనంగా పార్టీలో చేరిన శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి, వ్యాపార వేత్త ఎంఎం.మహమ్మదాలి లు తమ సహచరులైన ఖలీల్‌ అహమ్మద్‌, రహమత్‌బాషా, ఎస్‌కెపి.ఖాజా, ఇమ్రాన్‌, రవిచంద్రరాజు, అఫ్సర్‌బాషా, నూరుల్లా తో కలసి సుమారు 100 మంది కార్యకర్తలను పార్టీలో చేర్చారు. వీరందరికి మంత్రి పెద్దిరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాధరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుల వలె పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, మైనార్టీల నాయకులు బిటి.అతావుల్లా, ఎంఎం.సాధిక్‌, సలీం, నూరుల్లా, ఖాదర్‌, యూసుఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Leaders of the country joined YSRCP in the presence of Minister Peddireddy

Post Midle