పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడిన వైస్సార్సీపీ నాయకులు
తాడేపల్లి ముచ్చట్లు:
యువశక్తిలో యువత ఊసులేదు..పవన్ పై మంత్రుల పంచులు.యువశక్తి పేరుతో బహిరంగ సభ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ యువత ఊసేత్తలేదని మంత్రులు మండిపడ్డారు. యువత భవిష్యత్తుపై ఏమాత్రం ఆలోచన లేదని, కేవలం వైఎస్ఆర్సీపీ తిట్టడానికే దాదాపు 40నిమిషాల కేటాయించారని ఎద్దేవా చేశారు. నిజంగానే యువతపై ప్రేమాభిమానాలు ఉంటే వారికి మంచి సందేశం ఇస్తాడని, పవన్ కల్యాణ్ పక్కా ప్యాకేజీ స్టార్ అంటూ పంచ్ లు వేశారు. తాను ప్యాకేజీ తీసుకుని యువతతో చంద్రబాబు పల్లకి మోయించాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు.

పవన్ కల్యాణ్ ఓ కామెడీ పీస్: మంత్రి అంబటి రాంబాబు
ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవని పవన్..కామెడీ పీస్ అని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈసారి చంద్రబాబుతో కలిసి వచ్చినా రాజకీయ మరణం తథ్యం అన్నారు. పవన్ మాటలకు అర్థాలే వేరంటూ చుకలకు అంటించారు. జనసే అధ్యక్షుడికి దమ్ము, ధైర్యం లేదని అందుకే పిరికి సన్నాసిలా మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు కోసమే పవన్ జనసేన పార్టీ పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుతో పవన్ ఏం మాట్లాడాడో అన్నీ త్వరలోనే బయటపెడతామన్నారు. టీడీపీకి అమ్ముడుపోయేందుకే పవన్ కల్యాణ్ ఆరాటం అన్నారు. చెప్పులు తీసి కొడతామనడం రాజకీయమా..? అంటూ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.
పవన్ ఒంట్లో ‘కమ్మ’ని పసుపు రక్తం ప్రవహిస్తోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్
పవన్ కల్యాణ్ ఒంట్లో ప్రవహిస్తున్నది ‘కమ్మ’ని పసుపు రక్తమని ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ కు ఉన్నవి ఉక్కు నరాలు కాదని, నారా వారి నరాలు అని హేళన చేశారు.
యువశక్తి సభలో పవన్ ప్రసంగం అంతా ఆంబోతు రంకెలేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ పేరు మార్చి చంద్రసేన పెట్టుకుంటే బెటర్ సలహా ఇచ్చారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరు తెలియని పవన్ కు కనీసం నీ భార్య పిల్లలు పేర్లు చెప్పగలవా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు అమర్నాథ్. కాపుల మీద పవన్‌కు పేటెంట్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని.. పవన్‌లా సన్యాసి రాజకీయం చేసే కుటుంబం తమది కాదన్నారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకుంటే యువత చంద్రబాబు పల్లకి మొయ్యాలా అని ప్రశ్నించారు. జగన్ అన్న ప్రజల హృదయాల్లో ఖైదీగా ఉన్నారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
పండగపూట పగటి వేషగాడు పవన్ : మంత్రి అప్పలరాజు
పండగ పూట పగటి వేషాలు వేయడానికే ఉత్తరాంధ్రకు పవన్ కల్యాణ్ వచ్చాడని మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాని పవన్ పరోక్షంగా ఒప్పుకున్నాడని గుర్తుచేశారు. జన సైనికుల లక్ష్యాన్ని, ఆశయాన్ని, కష్టాన్ని..చంద్రబాబుకు తాకట్టు పెట్టాడన్నారు. పవన్ ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీక లేరని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు ఏపీలో రెండే ఫిషింగ్ హార్బర్లు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు ఏకంగా తొమ్మిది హార్బర్లు మంజూరయ్యాయని తెలిపారు.
అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం: మంత్రి ధర్మాన
రాజకీయ వ్యాపారవేత్త చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు తెలుపుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పిందో పవన్ ఎప్పుడైనా చదివారా? క్యాపిటల్ గురించి శివరామకృష్ణ కమిషన్ నివేదికను స్టడీ చేశారా? అని ప్రశ్నించారు. అమరావతి ఒక్కటే రాజధాని అయితే మళ్లీ తమ ప్రాంతం 50ఏళ్లు వెనకబడిపోతుందన్నారు. కొందరు క్యాపిటలిస్టుల కోసమే అమరావతిరాగం పాడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర తిరుగుబాటు గడ్డ అని, ఆకలి, కన్నీళ్లు చూసిన గడ్డ అన్నారు. తాను మాట్లాడకపోయినా మరొకరు ఈ ప్రాంతం గురించి మాట్లాడతారని తెలిపారు.
టీడీపీ స్క్రిప్ట్ చెక్ చేసుకోవడం తెలీదా దత్తపుత్ర: మంత్రి రోజా
ఇక పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా కూడా స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. రెండుసార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ తో తిట్టించుకోవాలా అంటూ ట్వీట్ చేశారు. తూ.. ప్రజల కోసం తప్పట్లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 45 లక్షల మంది జనాభానే లేరని.. మరి 45 లక్షల మంది ఎలా వలస వెళ్లారని ప్రశ్నించారు. టీడీపీ స్క్రిప్టు ఇస్తే మాత్రం కాస్త చెక్ చేసుకోవాలని తెలియదా దత్తపుత్రా అంటూ ట్వీట్ చేశారు.
Tags: Leaders of the Vice-RCP who attacked Pawan Kalyan
