Natyam ad

మహిళా గ్రూప్ సభ్యులను పార్టీ కార్యకర్తల్లాగా వాడుకుంటున్న నాయకులు

-మీటింగుకు రాకపోతే ఫైన్ లు విధిస్తామని బెదిరింపులు
-అనారోగ్యంతో ఉన్న మీటింగ్ పోవాల్సిందే

చొప్పదండి ముచ్చట్లు:

జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి భారీ బహిరంగ సమావేశానికి బలవంతంగా జనాన్ని తరలించడానికి శతవిధాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రభుత్వం పథకాల సమావేశాలు అధికారుల సమావేశాలు అధికార పార్టీ నాయకుల సమావేశాలకు మండలంలో గ్రామాలలో ఎక్కడ ఏమి సమావేశాలు జరిగిన మహిళా గ్రూప్ సభ్యుల పైన టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మహిళా గ్రూపుల సభ్యులను వాడుకుంటున్నారు వారిపైన అధికారుల ఒత్తిళ్లకు బలవంతంగా వారి గ్రూప్ సభ్యులను మీటింగుకు రావాలని లేదంటే ఫైన్ లు వేస్తామని గ్రూపు లీడర్లు సాధారణ సభ్యులను మరింత భయాందోళనకు గురి చేస్తూ కనీస కనికరం లేకుండా అనారోగ్యంతో ఉన్న మహిళలను కూడా మీటింగ్ కు తరలించారు. మీటింగుకు రాని వారిపై ఫైన్ లు కూడా 200 నుండి 300 వరకు పైన వేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కూలి నాలి చేసుకుని జీవనోపాధి పొందే వారికి తరచూ మీటింగ్ ల పేరుతో బలవంతంగా తీసుకొని పోవడంతో ఎవరికి చెప్పాలో అర్థం కాని సమస్యతో తమ ఆవేదనను మానసికంగా బాధపడుతున్నారు. మహిళా గ్రూపులో రుణాలు తీసుకున్న వారిపై మరింత ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రావాల్సిందే అని బెదిరిస్తున్నారని సమాచారం ఎవరి సొంత ఆస్తిలో నుండి ఇస్తున్నారు అర్థం కాని సమస్య మహిళా గ్రూపులో మొదలైంది. కొంతమంది గ్రూపు లీడర్ల ఒత్తిళ్లు బాగా అవుతున్నాయని మహిళా గ్రూప్ సభ్యుల నుండి సమాచారం అందింది. ఇలాంటి సంఘటనలు జగిత్యాల జిల్లా మల్యాల కొడిమ్యాల పలు దాదాపు అన్ని మండలాలలో చోటు చేసుకున్నాయి.

 

 

Post Midle

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా మహిళలలో ఆర్థిక స్వాలంభన పెంచడానికి పొదుపు చేసుకోవాలని జీవన విధానాలను మార్చి మహిళలను చైతన్య పరచడానికి మహిళా గ్రూపులు తయారు చేశారు అది క్రమంగా ప్రభుత్వాలకు నాయకులకు అధికారులకు మహిళ గ్రూపు సభ్యులను బానిసల్లాగా ప్రభుత్వ కార్యకర్తల్లాగా ప్రతి సమావేశాలకు వారిని పిలుస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా గ్రూప్ సభ్యులకు వారి పిల్లలకు జీవనోపాధి మార్గాలు కుటీర పరిశ్రమలు చేతివృత్తులు పలు ఆర్థికపరమైన పనులను నేర్పించి చైతన్య పరచడానికి సమావేశాలు నిర్వహించాలి కానీ ఇలాంటి పార్టీల మీటింగ్ లకు మండలానికి గ్రామానికి జిల్లా కేంద్రానికి ఏ నాయకుడు వచ్చినా పెద్ద స్థాయి అధికారులు ఎవరు వచ్చినా ముందుగా మహిళా గ్రూప్ సభ్యులను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని కొంతమంది మహిళ గ్రూప్ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఏదైనా సమావేశాలు పెట్టినప్పుడు స్వతహాగా వారే అభిమానంతో రావాలి కానీ ఇలా బలవంతపు ప్రయత్నాలు చేయడం మానుకోవాలని ఇప్పటికైనా అధికారులు మామూలు సభ్యులపై ఒత్తిళ్లు తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా గ్రూప్ సభ్యులు కోరుతున్నారు.

 

Tags: Leaders using women group members as party workers

Post Midle