డిసెంబర్ 11 తర్వాత పరిణామాలపై ఆలోచిస్తున్న నేతలు

Date:08/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు. ప్రస్తుతానికి అయితే కేసీఆర్ కు పరిస్థితి కేక్ వాక్ కాదని స్పష్టం అవుతోంది. ఎందుకంటే.. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత చాలా త్వరగా వస్తుంది. చరిత్ర ఈ విషయాన్ని చెబుతోంది. గతానికి ఇప్పటికీ తేడా కేసీఆర్ మాటల గారడీ. ఈ మాటల గారడీ మీడియా వరకే వర్కవుట్ అవుతుందా? లేక ప్రజలను కూడా ప్రభావితం చేసి మళ్లీ కేసీఆర్‌ను గెలిపిస్తుందా? అనేది డిసెంబర్ 11వ తేదీ కానీ తెలియదు.ఆ సంగతలా ఉంటే.. డిసెంబర్ 11 తర్వాత పరిణామాలను అంచనా వేయడానికి కష్టమవుతున్న తరుణంలో కేసీఆర్ తనవంతుగా లోలోపల కొన్ని కొత్త ఎత్తుగడలను వేస్తున్నట్టుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. ఇప్పుడే కొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్లకు గాలం వేయడం.
మహాకూటమి తరఫున అభ్యర్థిత్వాన్ని సంపాదించగల కొంతమంది నేతలకు కేసీఆర్ ఇప్పుడే గాలం వేసేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.ఎన్నికల్లో నెగ్గుకు రాగలరు అనుకున్న వాళ్లకు కేసీఆర్ వెనుక నుండి ఫండింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. వాళ్లు గెలిస్తే.. తెరాస వైపుకు వచ్చేయాలనమాట. ఇదీ లెక్క. ఈ లెక్కతో కేసీఆర్ కొంతమంది వైరిపక్ష ఎమ్మెల్యేలను కూడా వెంట పెట్టుకోవడానికి సన్నద్ధం అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
మీడియా సర్కిల్స్‌లో కూడా ఈ మేరకు ప్రచారం జరుగుతోంది.ప్రత్యేకించి కొంతమంది తెలుగుదేశం నేతలకు కేసీఆర్ ఈ మేరకు వల వేశాడని.. వీళ్లు కాంగ్రెస్ తో పొత్తుతో నెగ్గినా.. గెలిస్తే నిర్మొహమాటంగా తెరాస శిబిరంలోకి చేరిపోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫిరాయింపుల పర్వం నిస్సిగ్గుగా జరిగింది.ఏపీలో అయినా, తెలంగాణలో అయినా అదే జరిగింది. ఇలాంటి నేపథ్యంలో రేపు తెలంగాణలో బలాబలాలు సరిసమాన స్థాయిలో వచ్చినా ఇలాంటి ఫిరాయింపులు ఖాయమని చెప్పవచ్చు.
Tags:Leaders who think of the consequences after December 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *