నీళ్ల కోసం రాజీనామా చేస్తానంటున్న నేతలు వెంటనే రాజీనామా చేయాలి

– సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ ఏర్పాటు నీళ్ల కోసమని, కృష్ణా-గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకోవాలని ఉద్యమం మొదలైందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా తో మాట్లాడుతూ 29లక్షల ఎకరాల కృష్ణాబేసిన్ పై తెలంగాణ ప్రాంత రైతులు ఆధారాపడ్డారు. టీ-సర్కార్ ఆర్థిక ప్రయోజనాల కోసం ఏడాది పాటు ఆలస్యం చేసిందని,రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులను పణంగా పెట్టొద్దని అన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టే ఇప్పుడు మాట్లాడుతున్నారని, టెండర్లు అయ్యే వరకు ఎందుకు అపెక్స్ మీటింగ్ కి వెళ్ళలేదని బట్టి ప్రశ్నించారు. నీళ్ల కోసం రాజీనామా చేస్తానంటున్న నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఆ రోజు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లకుండాప్రతిపక్షాలను కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Leaders who want to resign for water should resign immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *