చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులకు చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ తెలిపారు.గురువారం స్థానిక రవీంద్రభారతి పాఠశాలలో ప్రిన్సిపాల్‌ యల్లమ్మ ఆధ్వర్యంలో లీడర్‌షిఫ్‌ క్వాలిటిస్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ కార్యక్రమంలో ఎస్‌ఐ పాల్గొని విద్యార్థులకు అనేక సూచనలు చేశారు. నాయకులుగా ఎదిగే వారికి క్రమశిక్షణ, వినయవిదేయతలు ఉండాలన్నారు. చిన్నతనం నుంచి అలవాటు చేసుకున్న వారు భవిష్యత్తులో మంచి నాయకులుగా రాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ నాయకత్వలక్షణాలు కలిగిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Tags: Leadership qualities from childhood

Leave A Reply

Your email address will not be published.