ప్రముఖ నటి కవిత ఇంట్లో విషాదం భర్త కోవిడ్ తో మృతి  

-15రోజుల క్రితం కొడుకు మృతి

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ప్రముఖ తెలుగు సినీ నటి కవితకి కరోనా తీవ్ర విషాదం మిగిల్చింది. కేవలం 15 రోజులలో ఆమె భర్త దశరథరాజు, కుమారుడు స్వరూప్ మరణించడంతో కవిత అంతులేని విషాదంలో మునిగిపోయారు. తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషలలో ఆమె నటించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తల్లి, వదిన పాత్రల్లో నటించి మెప్పించారు. కవిత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడల భాషాల్లో కలిపి మొత్తంగా 350 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. కవిత ప్రస్తుతం ఎండ్రాండ్రం పున్నగై అనే తమిళ టీవీ షోలో కీలక పాత్ర పోషిస్తున్నారు.కవిత భర్త దశరథరాజు బుధవారం ఉదయం మరణించగ ఆమె కుమారుడు జూన్ 15 వతేదిన మరణించారు. కవిత కుటుంబంలో విషాదంపై అన్ని సినీప్రముఖలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమెను ప్రముఖ నటులు ఫోన్ లో పరామర్శిస్తున్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Leading actress Kavitha dies in house tragedy husband Kovid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *