పుంగనూరులో గృహనిర్మాణాలలో ముందంజ -కమిషనర్‌ కెఎల్‌.వర్మ.

పుంగనూరు ముచ్చట్లు:

 

 

మున్సిపాలిటి పరిధిలో నిర్మిస్తున్న జగనన్నకాలనీలలో నిర్మాణ పనుల్లో ముందంజలో ఉన్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పట్టణ సమీపంలోని నక్కబండ వద్ద 300, 365, 430 చదరపు అడుగుల నిర్మాణాలు టిట్కోద్వారా చేపట్టామన్నారు. ఇందులో 300 చదరపు అడుగుల నిర్మాణాలు 1500 మంది లభ్ధిదారులకు గృహాలు పూర్తిగా నిర్మించి, గృహప్రవేశాలకు సిద్దం చేశామన్నారు. అలాగే త్వరలోనే రోడ్లు, కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాగానిపల్లె, రాంపల్లె , నక్కబండ, డిగ్రీ కళాశాల వద్ద లేఔట్లు వేసి, 1300 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించామన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో జగనన్నకాలనీలు ఆదర్శంగా తయారు చేసే దిశలో ముందంజలో ఉన్నామని, నిర్మాణాల్లో లబ్ధిదారులు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Leading Commissioner of Housing in Punganur – Commissioner KL Verma.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *