వీధిలైట్ల స్థానాన్నే ఎల్ ఇ డి బల్బులు 

Led the bulb of the streetlights

Led the bulb of the streetlights

 Date:13/07/2018
ఏలూరు ముచ్చట్లు:
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎల్ ఇ డి బల్బుల అమరికలో భాగంగా వారానికి 10 వేలు చొప్పున వీధిలైట్లు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్ ఆదేశించారు . స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గ్రామపంచాయతీల్లో వివిధ అభివృద్ది పనుల ప్రగతితీరును పంచాయతీ అధికారులతో కలెక్టర్ డా.భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రస్తుతం వున్న వీధిలైట్ల స్థానాన్నే ఎల్ ఇ డి బల్బులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తీసుకున్నప్పటికీ వీటి ఏర్పాటులో ఇంకా జాప్యం చేయడం తగదన్నారు. యుద్దప్రాతిపదికపై ఎల్ఇడి బల్బులు ఏర్పాటు చేసేవిషయంపై పూర్తీ శ్రద్ద పహించాలన్నారు .దీని వల్ల గ్రామపంచాయతిల్లో కూడా విధ్యుత్ చార్జీలు ఘననీయంగా తగ్గుతాయన్నారు. గ్రామాల్లో పారిశుద్ద్య పరిస్థితులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించకుండా గ్రామాల్లో చెత్తకనబడితే పంచాయతీ సెక్రటరీ బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. ఇంటింటి నుండి చెత్తసేకరించేందుకు ప్రత్యేక గ్రీన్ వాహనాలు ఏర్పాటు చేయడంతోపాటు వాటిని తరలిస్తున్నదీ లేనిది తెలుసుకునేందుకు టాగ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే సంబంధిత సిబ్బంది ఆ టాగ్ లను స్కానింగ్ చేయకుండా తమ ఇష్టానుసారం విధులు నిర్వహిస్తామంటే సహంచేది లేదన్నారు. గ్రామాలు పూర్తి ఆరోగ్యకర వాతావరణంలో ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఇందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ సంబందిత అదికారులు సిబ్బంది పర్యవేక్షణ కొరవడటం మూలంగా అనుకున్న ఫలితాలు రావడంలేదన్నారు. గ్రామాల అభివృద్దికి పంచాయతీ అధికారులు ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలను సాధించవలసి వుందని, ఆదిశగా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ షెడ్లు నిర్మాణంపై గత రెండు సంవత్సరాలుగా వెంటపడుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్థలం దొరకలేదని, స్థలం వెతుకుతున్నామని చెప్పడం ఒప్పుకోనని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో చెత్తకుప్పులు పందులు, కుక్కలు ఎక్కువగా ద ర్శనం ఇస్తున్నాయని, ఈ విషయంలో కూడా పంచాయతీ కార్యదర్శులుకాని, ఇఒపిఆర్‌డిలు కాని పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఇంటింటి చెత్తసేకరణకు ఏర్పాటుచేసే గ్రీన్ వాహనాలకు సంబంధించి డిడి లు విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఇఒపిఆర్‌డి లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఎంవి రమణ, డివిజనల్ పంచాయతీ అధికారులు చిన్నారావు, ఎంఎల్ రామకృష్ణ, అమ్మాజి, ఎం నాగలత, తదితరులు పాల్గొన్నారు.
వీధిలైట్ల స్థానాన్నే ఎల్ ఇ డి బల్బులుhttps://www.telugumuchatlu.com/led-the-bulb-of-the-streetlights/
Tags:Led the bulb of the streetlights

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *