సిపిఎస్ రద్దు చేయాలని వామ పక్ష పార్టీలు డిమాండ్
విశాఖపట్నం ముచ్చట్లు:
ఉద్యోగ, ఉపాధ్యాయులపై వైసిపి ప్రభుత్వ వేధింపులు ఆపాలని, సిపిఎ స్ రద్దు చేయాలని వామ పక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఓపిఎస్ అమలు చేయాలని, ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ.. సిపిఎం, సిపిఐ విశాఖజిల్లా కమిటీల ఆధ్వర్యంలో విశాఖలోని జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది . ఈ సందర్భంగా సిపిఎం, సీపీఐ నాయకులు మాట్లా డుతూ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వస్తే మాట తప్పను… మడమ తిప్పను అని చెప్పి ఇప్పుడు ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం మాట తప్పిన కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. ముఖ్యమంత్రి మాట మీద నిలబడే వ్యక్తి అయితే ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

TagsLeft parties demand to abolish CPS
