Natyam ad

రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల నిరసనలు

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడలో బుధవారం  వామపక్ష పార్టీల నేతల సమావేశం జరిగింది. ప్రధాని మోడీ ఎపి పర్యటన సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ పై చర్చ జరిగింది.
సిపిఐ కార్యదర్శి  రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈనెల 11,12 పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతాం. మోడీ ఎపిని అన్నివిధాల  మోసం చేసి, సిగ్గు లేకుండా వస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఒక్క అంశంలో అయినా న్యాయం చేసిందా. జగన్ కూడా అధికార యంత్రాంగాన్ని మోడీ పర్యటన కు వినియోగిస్తున్నారు. వేల కోట్ల తో ప్లీనరీ సమావేశం తరహాలో ప్రచారం చేస్తున్నారు. హోదా లేదు, పోలవరం పూర్తి కాలేదు, విభజన హామీలు అమలు చేయలేదు. మోడీ మెడలు వంచుతా అన్న జగన్ మోడీ ముందు తల వంచుతూనే  ఉన్నాడు.
బిజెపి తమ కార్యక్రమం గా చెప్పుకుంటే.. విజయసాయి రెడ్డి వారికన్నా అత్యుత్సాహంతో ప్రకటన చేస్తున్నారు. అంటే మోడీ అంటే భయమా, కేసుక నుంచి బయట పడేందుకా అని అడిగారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం వద్దని మా వాళ్లు పోరాటాలు చేస్తున్నారు. మోడీ స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుతామని  చెప్పాకే  ఎపిలో అడుగు పెట్టాలి. ఈ రెండు రోజులు మా నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు కూడా  నల్ల జెండాలతో నిరసన తెలపాలని అన్నారు.

 

 

సిపిఎం నేత శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ద్రోహం చేసిన వారికే… ప్రజల సొమ్ముతో పెద్ద పీఠ వేస్తున్నారు. రైల్వే జోన్ ఇవ్వరు.. ఎపికి అన్యాయం చేసిన వారికి సన్మానాలా. పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం లేదు. లాభాలలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తారా. మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీ లో జగన్ తీర్మానం చేశారు. ఇప్పుడు ఏమీ చేయకుండానే సాగిలపడి స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. బిజెపి తరహాలో వైసిపి కూడా ప్రజా వ్యతిరేక  తప్పదు. సభలకు అనుమతి ఇచ్చి.. మళ్లీ నోటీసులు ఇవ్వడం ఏమిటి. రాష్ట్రం లో నిరసనకు తెలిపే హక్కు లేదా. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రతిపక్ష పార్టీలు చూస్తూ కూర్చుంటాయా. ఎపి ప్రభుత్వం కూడా మోడీ ని నిలదీయాలి. రాష్ట్రానికి మేలు చేసేలా  హామీల అమలుకు డిమాండ్ చేయాలి. ఈనెల 11,12తేదీలలో వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

 

Post Midle

Tags: Left-wing protests across the state

Post Midle

Leave A Reply

Your email address will not be published.