ప్రజలందరికీ అందుబాటులో న్యాయ సేవలు

– న్యాయ మూర్తి పురుషోత్తం కుమార్
Date:09/11/2018
తిరుపతి ముచ్చట్లు:
 ప్రజలందరికి న్యాయ సేవలందించడానికే  1995 నవంబర్ 9న  జాతీయ న్యాయ సేవధికార  సంస్థ  రూపొందించిన చట్టం అమలులోకి వచ్చిందని ఆనాటి నుండి  మనం  న్యాయ సేవ దినోత్సవం  జరుపుకొంటు న్నామని మండల న్యాయ సేవధికార  సంస్థ ఛైర్మన్ మరియు మూడవ  అదనపు జిల్లా న్యాయమూర్తి  సి. పురుషోత్తం కుమార్  అన్నారు.
న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా  స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయ మూర్తులు, న్యాయ వాదులతో సమావేశం ఏర్పాటు చేసి  న్యాయ సేవలపై  ప్రసంగించారు.  ఈసందర్బంగా మండల సేవాధికార సంస్థ  ఛైర్మన్  మాట్లాడుతూ  ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడానికి తిరుపతి కోర్టు పరిధిలో  గత 10 నెలల్లో 92 న్యాయసేవా సదస్సులు  నిర్వహించి అవగాహన కల్పించామని అన్నారు.
తిరుపతి మండల న్యాయ సేవాధికర సంస్థ పరిధిలో 36  లోక్ అదాలత్ కార్యక్రమాలు  నిర్వహించి 701 కేసులు పరిష్కరించగలిగామని తెలిపారు.  ప్రధానంగా ప్రజలు గుర్తించాల్సింది చట్టలపై అవగాహన కలిగి వుండాలని,   చట్టం పరిధిలో  ధనిక , పేద , చదువుకున్న , చదువు లేని వారికి  ఏ చట్టమైన సమానమేనని అన్నారు.   అవగాహన కల్పించడం కోసం  తిరుపతి కోర్టు పరిధిలో  దాదాపు 80 మంది న్యాయవాదులు   ప్యానల్ లో నమోదు చేసుకుని  సేవలందిస్తున్నారని తెలిపారు.
నాల్గవ  అదనపు న్యాయమూర్తి  రామగోపాల్ మాట్లాడుతూ  భారత రాజ్యాంగం ఆర్థిక అసమానతలు తొల గించాలనే ఉద్దేశ్యంతో , సమాజ సమతుల్యం పాటించాలని చట్టాలు చేస్తుందని అన్నారు.  సమాజం పట్ల అవగాహన కల్పించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి న్యాయ సేవధికర సంస్థ విస్తృత సేవలు , విజ్ఞాన సదస్సులు  అందించడానికి  లోక్ అదాలత్, న్యాయసదస్సులు  వంటి కార్యక్రమాలు చేపట్టి కేసులు త్వరిత గతిన పరిష్కరిస్తూ  కోర్టు ఫీజులు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుందని అన్నారు.  పేదవారు న్యాయం కోసం ఉచిత సేవలు పొందాలని  మనకెందుకులే అని వుండరాదని సూచించారు.
న్యాయ మూర్తులు, న్యాయ వాదులు  మండల సేవాధికర సంస్థ అందిస్తున్న  వివిధ సేవల గురించి, సదస్సులు నిర్వహణ గురించి సభలో ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి వుండాలని సత్వర  న్యాయ సేవలు పొందడానికి న్యాయ సేవధికర సంస్థను సంప్రదించాలని  సూచించారు. లైంగిక వేధింపులు, అక్రమ మహిళల రవాణా , కార్మికులు, బాల బాలికలు,  మానసిక  వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, నరేగా కూలీలు, ఎస్సీ ఎస్టీలు, వయో వృద్దులు, ఉచిత సేవలు పొందడానికి అర్హులని వివరించారు.
ఈ కార్యక్రమంలో 5వ అడిషనల్ జిల్లా న్యాయ మూర్తి నరసింహ రాజు, 10వ జిల్లా న్యాయమూర్తి  మూర్తి జి. అన్వర్ బాషా , ప్రిన్సిపల్ సివిల్ జడ్జి డి. ఏడుకొండలు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుదేవ రాజు , న్యాయ వాదులు , న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారు పాల్గొన్నారు.
Tags; Legal services available to all people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed