ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలియజేసిన  శాసన సభాపతి పోచారం

కామారెడ్డి  ముచ్చట్లు :
రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. బాన్సువాడ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటుగా నూతనంగా మరో అయిదువేల డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంత భూములకు నీరందించడానికి జాకోరా, చందూరు ఎత్తిపోతలు, సిద్దాపూర్ రిజర్వాయర్ మరియు మంజీర నదిపై చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినందుకు స్పీకర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Legislative Speaker Pocharam thanked Chief Minister KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *