చిన్న తిరుమలలో నిమ్మగడ్డ

Date:21/01/2021

ద్వారకా తిరుమల

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో టి. భ్రమరాంబ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆయన ఆలయ ఆవరణలో అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల లఘు దర్శనాన్ని చేసుకుని పూజించారు. ఆ తర్వాత ఆలయ ప్రదక్షిణ మండపంలో  అర్చకులు,పండితులు ఆయనకు స్వామి వారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఈవో భ్రమరాంబ ఆయనకు స్వామి వారి  చిత్ర పటాన్ని ఇచ్చి, ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ఆయన కాసేపు ధ్యానముద్రలో కూర్చొన్నారు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags; Lemongrass in small wrinkles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *