Leopard heroism in Horsleyhills

హార్సిలీహిల్స్ లో చిరుతపులి వీరవిహారం

Date:08/04/2020

హార్సిలీహిల్స్ ముచ్చట్లు:

ప్రముఖ పర్యావటక కేంద్రమైన హార్సిలీహిల్స్లో చిరుతపులి వీరవిహారం చేయడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. రైల్వే గెస్ట్ హౌస్ సమీపంలో కుక్కను పట్టుకుని చిరుతపులి వెళ్లడాన్ని వాచ్‌మెన్‌ కుటుంబ సభ్యులు గమనించి పరుగులు తీశారు. వరుసగా చిరుతపులి సంచరిస్తుండటం, అటవీశాఖాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కాగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు హార్సిలీహిల్స్కు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని,లేకపోతే ఊహించని నష్టం జరిగేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సబ్‌ కలెక్టర్‌ చేకూర్తి కీర్తి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మహిళల రుణాలు వసూలు మూడు నెలలు వాయిదా

Tags: Leopard heroism in Horsleyhills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *