ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలంరేపుతోంది. యూనివర్శిటీ పరిపాలనా భవనం దగ్గర శునకాలపై చిరుత దాడికి ప్రయత్నించింది. ఈ దృశ్యాలు వర్శిటీలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో యూనివర్సిటీ విద్యార్థులు, భద్రతా సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.ఎస్వీ యూవర్సిటీకి చేరుకున్న అటవీ సిబ్బంది చిరుత సంచరించిన పరిసరాలను పరిశీలించారు. ఆరు నెలలుగా ఎస్వీ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని, రెండుసార్లు కుక్కలపై కూడా దాడి చేశాయని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నెల 14న మెయిన్ బిల్డింగ్ దగ్గర చిరుత కుక్కలపై దాడికి ప్రయత్నించింది. యూనివర్శిటీలో విద్యార్థులను రాత్రిపూట బయట తిరగవద్దని అధికారులు సూచించారు. గతంలో కూడా చిరుత జాడ ఆ పరిసరాల్లో కనిపించడంతో స్థానికులు కూడా హడలిపోతున్నారు.

 

Tags: Leopard migration at SV Veterinary University

Leave A Reply

Your email address will not be published.