Natyam ad

అనకాపల్లి జిల్లాలో చిరుత సంచారం

అనకాపల్లి ముచ్చట్లు:


గత నాలుగు నెలల్లో బెంగాల్ టైగర్ అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ పశువుల పై దాడి చేసి చంపిన సంఘటన మరువకముందే అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం గ్రామంలో లేక దూడపై జరిగిన చిరుత దాడితో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు, గడిచిన నాలుగు నెలల కాలంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో గుర్తించిన పెద్దపులి అధికారులు పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు పెద్దపులి కోసం ఏర్పాటుచేసిన బోనులను తప్పించుకొని అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది గ్రామాలలో సంచరిస్తూ ఆకలి తీర్చుకునేందుకు పశువులను మట్టు పెట్టేది, పులిని పట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నించిన అటవీశాఖ అధికారులు బెంగళూరు నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని రప్పించారు పులిని కనిపెట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన డ్రోన్లు ఉపయోగించారు. అయినప్పటికీ ఫలితాన్ని ఇవ్వలేకపోయింది పులి కసింకోట మండలం అనకాపల్లి మీదుగా సబ్బవరం కోటపాడు ఎస్ కోట మీదగా విజయనగరం జిల్లా అడివి ప్రాంతానికి చేరుకుంది పులిని పట్టుకుందామన్న ప్రయత్నంలో విసిగిపోయిన ఫారెస్ట్ అధికారులు విజయనగరం జిల్లా ప్రాంతం నుండి ఒరిస్సా వైపుకు వెళ్ళిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు పులి పశువులను వధించిన సమాచారాన్ని బట్టి పులి సంచారాన్ని గుర్తిస్తూ ఎక్కడికక్కడ పశుకలాపారాలని ఏర్పాటు చేసి పులికి ఎర్రగా వేసేవారు అయినప్పటికీ పులి ఎక్కడ కూడా బోనుకు చిక్కకుండా తప్పించుకు తిరిగేది. అనకాపల్లి జిల్లా నుండి ప్రయాణిస్తూ ఒరిస్సా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిపోయిందని ఊపిరి తీసుకుంటున్న సమయంలో అనకాపల్లి జిల్లాలోని చిరుత దాడి మరోసారి కలకలం రేపింది.

 

Tags: Leopard migration in Anakapalli district

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.