కుష్ఠువ్యాధి నివారణ అవసరం
పుంగనూరు ముచ్చట్లు:
కుష్ఠువ్యాధి నివారణ ఎంతో అవసరమని , ఇందుకోసం ప్రతి ఒక్కరు సహకరించాలని డిపిఎంవో దేవదాసు సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని ఈడిగపల్లె హైస్కూల్‌లో కుష్ఠువ్యాధి నివారణ వారోత్సవాలను విద్యార్థులతో నిర్వహించారు. దేవదాసు మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలసాయిరెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో కుష్ఠువ్యాధి నివారణ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కుష్ఠువ్యాధి గ్రస్తులను గుర్తించి, నివారణ చేపడుతున్నామన్నారు. వారి పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పి లావణ్య, ఏఎన్‌ఎం భారతి, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

Tags: Leprosy prevention is essential
