అభివృద్ధి కి అందరూ సహకరిద్దాం

Let everyone cooperate with development

Let everyone cooperate with development

Date:18/09/2018

పలమనేరు ముచ్చట్లు :

పలమనేరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలులో నాయకులందరూ పరస్పర  సహకారంతో ముందుకు సాగాలని పలమనేరు పట్టణ కన్వీనర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు .రానున్న ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు . తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు .

 

ఈ సమావేశంలో పలమనేర్ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బాల సుందరం రెడ్డి ,నాయకులు అమ్ములు ,కిరణ్, ఎస్సీ సెల్ నాగరాజ్ ,గిరిబాబు ,మహబూబ్ బాషా కోటేశ్వరతదితరులు పాల్గొన్నారు.

గ్లూకో మీటర్ ఖరీదు ఐదు లక్షలు : సోము వీర్రాజు

Tags:Let everyone cooperate with development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *