పుంగనూరులో గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయండి – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమైయ్యేందుకు ప్రవేశపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, గనులు, విద్యుత్ , సైన్స్ అండ్ టెక్నాలజి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పుంగనూరు మండలం బోడేవారిపల్లెలో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఒకొక్కరికి ఎన్ని లక్షలు అందిందని అడిగారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గూర్చి వివరించాలన్నారు. అలాగే ఎవరికైనా పథకాలు అందకపోతే తక్షణమే గ్రామ సచివాలయంలో నమోదు చేసుకోవాలని 21 రోజులలోపు పథకాలు మంజూరౌతుందని మంత్రి తెలిపారు. గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో 90 శాతం పైగా హామిలు అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని కొనియాడారు. మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి వివరించడమే గడపగడపకు ప్రభుత్వం లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు , స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలసి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరు పర్యటించాలని కోరారు. అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావే శంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మంత్రి పిఏ చంద్రహాస్,
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదరి విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Tags: Let everyone in our government participate and win for Gadapagadap in Punganur
– Minister Peddireddy Ramachandrareddy
