ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ పాటించి కరోనాను నివారిద్దాం

– రామగుండం సీపీ సత్యనారాయణ

– గోదావరిఖని 2 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో రాపిడ్ టెస్ట్ లు

పెద్దపల్లి  ముచ్చట్లు:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లంబాడి తండా, సంతోష్ నగర్, ఆర్జీ 2 ప్రాంతంలో కోవిడ్ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నడడంతో గోదావరిఖని 2టౌన్ సీఐ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో వైద్య, సింగరేణి అధికారుల సమన్వయంతో కరోనా రాపిడ్ టెస్ట్ లు నిర్వహించడం జరిగింది. అందులో 52 మందికి పరీక్షలు చేపించగా 12 మంది కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. పాజిటివ్ వచ్చిన బాధితులకు వైద్య శాఖ వారి సహాయంతో వైద్య కిట్ లను అందచేశారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, విధిగా సానిటైజర్ ఉపయోగిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హోం ఐసోలేషన్ లో ఉండాలని, హోం ఐసోలేషన్ అవకాశం లేని వారికి గోదావరిఖని సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కి సమాచారం ఇస్తే అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ వైరస్ కి ధనిక పేద తేడా లేదు కేవలం జీవం కలిగిన శరీరం ఐతే చాలు – ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ పాటించి కరోనాను నివారిద్దాం అని సీపీ ప్రజలకు సూచించారు. లాక్ డౌన్ పాటించాలని  సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి వలన కళ్ళముందే కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు మృతి చెందుతున్నరని, బాధ్యతా రాహిత్యంగా, అవగాహన రాహిత్యంగా కారణాలు లేకుండా రోడ్ల మీదకు వచ్చి అత్యవసర పనులకోసం ఆపదలో బయటకు వచ్చే వారికి ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించ కూడదన్నారు. ఇటువంటి విపత్కర సమయాలలో నిబంధనల ఉల్లంఘన చేయడం అత్యంత బాధ్యారాహిత్యం అని ప్రజలు గ్రహించాలని అన్నారు. వైద్య శాఖ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నా అందరికి కరోనా టెస్ట్ లు చేపించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఇక్కడ ఎవరైనా అనవసరంగా బయటతిరుగుతూ ఉంటే కఠినంగా వ్యవహారించాలని, కేసులు నమోదు చేయాలి వాహనాలు సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కువ శ్రద్ద వహించి పాజిటివ్ కేసులు తగ్గే విధంగా అన్ని శాఖల సమన్వయంతో కృషి చేయాలని సీపీ అన్నారు. డీసీపీ పెద్దపల్లి రవీందర్, ఏసీపీ గోదావరిఖని ఉమెందర్, సీఐ శ్రీనివాస్ రావు, రవీందర్, ఢీ ఎం హెచ్ ఓ ప్రమోద్, జీఎం వెంకటేశ్వర్లు, ఎస్ఐ సంతోష్, కార్పొరేటర్ శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Let everyone take self-defense and avoid the corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *