నియంతృత్వ దోరణిని వీడాలి

Date:18/10/2019

సూర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు  క్ష్మీనారాయణరెడ్డి నివాసంలో ఏఐసీసీ  కార్యవర్గ సభ్యులు దాసోజు శ్రావణ్ కుమార్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించి కేసీఆర్  కి బుద్ధి చెబుతామన్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు కెసిఆర్ పాల్గొనబోయే బహిరంగ సభకు ఆర్టీసీ  కార్మికుల కన్నీటి బొట్లె తుపానులా మారి బహిరంగ సభను రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడిందనిఅన్నారు. ఇకనైనా కెసిఆర్ పునరాలోచించుకుని నీ నియంతృత్వ ధోరణిని మార్చుకోవాలని,మీరు చేసే అరాచకానికి ప్రజలే కాక వరుణ దేవుడు కూడా మీపై విరక్తి చెంది మిమ్మల్ని హుజుర్ నగర్ గడ్డ మీద అడుగు పెట్టకుండా చేశాడని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్, బిల్యా నాయక్, వంగవీటి రామారావు, తో  పాటు  పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమీక్ష

 

Tags: Let go of the dictatorship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *