Natyam ad

ఇంటింటా సేవలందించిన జగనన్నను రెండవ సారి గెలిపించండి -చైర్మన్‌ అలీమ్‌బాషా.

పుంగనూరుముచ్చట్లు:

దేశ చరిత్రలో ఎన్నడులేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు అధికారులను పంపి అన్ని రకాల సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిని చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా కోరారు. బుధవారం మున్సిపాలిటిలోని కొత్తపేట, రాగానిపల్లె రోడ్డు ప్రాంతాలలో గడపగడపకు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ ఇంటింటికి వెళ్లి ఏమైన సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. సమస్యలను నమోదు చేసుకున్నారు. అలాగే ప్రజలకు అందిస్తున్న నవరత్న పథకాలు గురించి వివరించారు. పథ కాలు అందుతున్నాయా లేదా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు సేవలు ఎలా ఉన్నాయంటు తెలుసుకున్నారు. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటిలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వ విధానాలను వివరిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వధించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు కృష్ణారెడ్డి, బావాజాన్‌, పార్టీ నాయకులు రాజగోపాల్‌, సయ్యద్‌, మల్లికార్జున , నారాయణరెడ్డితో పాటు కార్యదర్శులు , వలంటీర్లు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Let Jagannana, who served at home, win for the second time – Chairman Aleem Basha.

Post Midle